కాజీపేట, జులై 30 : కాజీపేట పట్టణం 48వ డివిజన్ పరిధిలో ఆగస్టు 21, 22, 23, తేదీలలో జరగబోయే కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాని దర్గా ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, హజ్ కమిటీ చైర్మన్, దర్గా పీఠాధిపతి కుసురుపాషా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు తదితరులు ఉన్నారు.