Accident | ఖిలా వరంగల్, అక్టోబర్ 14 : పచ్చగడ్డి కోసం రైలు పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని ఓ భవన నిర్మాణ రంగ మేస్త్రీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది.
వివరాల్లోకి వెళ్లితే వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ రవీందర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. సంగెం మండల కేంద్రానికి చెందిన గుండేటి భాస్కర్ (38) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. కాగా తనకున్న నాలుగు పాడి గేదల కోసం పచ్చగడ్డి కోసుకురావడానికి మైలు రాయి 391/29-27 అప్‌లైన్ ఎల్గూరు, చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అప్‌లైన్‌లో వెళుతున్న జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్‌కు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు.
రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనా నిర్వహించి ఎంజీఎం దవాఖానలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతడి తల్లి గుండేటి యాకలక్ష్మికి అప్పగించి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి భార్య మౌనిక, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య