మహాదేవపూర్, జూన్ 12: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం నదిలో గురువారం మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి మృతుడు ఖాసీంపల్లికి చెందిన నల్లపూరి రమేష్ (54)గా గుర్తించారు కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం రమేష్ ఇంటి నుండి కనిపించకుండా వెళ్లి గోదావరిలో మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Kalpika Ganesh | పబ్‌లో గొడవ.. నటి కల్పిక గణేశ్‌పై కేసు నమోదు
Rashmika | రష్మిక షేర్ చేసిన ఈ ఒక్క ఫొటోకి పిచ్చి లైక్స్.. అంత స్పెషల్ ఏంటంటే..!
Mangli | నాకు నిజంగా అవగాహన లేదు.. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు: మంగ్లీ