Kalpika Ganesh | పబ్‌లో గొడవ.. నటి కల్పిక గణేశ్‌పై కేసు నమోదు
Kalpika Ganesh | నటి కల్పిక గణేశ్ (Kalpika Ganesh)పై కేసు నమోదైంది (Case filed).
Kalpika Ganesh | నటి కల్పిక గణేశ్ (Kalpika Ganesh)పై కేసు నమోదైంది (Case filed). హైదరాబాద్ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్ (Prism Pub) సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా గచ్చిబౌలి పోలీసులు (Gachibowli police) నటిపై కేసు నమోదు చేశారు.
నటి కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌కు వెళ్లింది. అక్కడ కేక్ విషయంలో కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పబ్‌లో గొడవకు సంబంధించి కల్పిక ఇటీవలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేక్ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్ ఎడిక్ట్ అంటూ దూషించారని అందులో పేర్కొంది. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది.
Also Read..
Rashmika | రష్మిక షేర్ చేసిన ఈ ఒక్క ఫొటోకి పిచ్చి లైక్స్.. అంత స్పెషల్ ఏంటంటే..!
Mangli | నాకు నిజంగా అవగాహన లేదు.. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు: మంగ్లీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

