Rashmika | కన్నడ బ్యూటీ రష్మిక హవా మాములుగా లేదు. ఈ అమ్మడు పుష్ప, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన ప్రతి సినిమా 1000 కోట్ల కలెక్ట్ చేసి ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. అయితే.. ఆ మూడు సినిమాల్లోనూ ఆమె భార్య పాత్ర పోషించడం విశేషం. ఈ రికార్డ్ రష్మికకే సొంతం కాగా, ఈ విషయంలో నాగార్జున కూడా రష్మికపై ప్రశంసలు కురిపించాడు. గత మూడేళ్లలో మా స్టార్ హీరోల్లో ఎవరూ 2000, 3000 కోట్లు గడించలేదు. కానీ రష్మిక ఆ అరుదైన రికార్డ్ ను దక్కించుకుంది అంటూ కుబేర సాంగ్ లాంచ్ ఈవెంట్లో నాగార్జున ఇచ్చిన ఎలివేషన్ కి రష్మిక స్టేజ్ మీద ఉబ్బితబ్బిబ్బయింది.
ప్రస్తుతం రష్మిక కుబేర సినిమా చేస్తున్నారు. కింగ్ నాగ్, ధనుష్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతుండగా, మూవీని జూన్ 20 న విడుదల చేయనున్నారు. ఇటీవల కుబేర టీం చెన్నైలో ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసింది. ఆ ఈవెంట్లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒకెత్తైతే.. ఈ ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్‌తో క్యాండిడ్ మూమెంట్స్‌ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలానే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఆ పిక్ స్పెషాలిటీ ఏంటంటే.. కింగ్ నాగార్జున రష్మికకి ఏదో చెబుతుంటే… ఆయాన కాళ్ల దగ్గర కూర్చుని రష్మిక వింటుంది. ఇంత ఎదిగిన కూడా రష్మిక సింప్లిసిటీ.. పెద్దలకు గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రష్మిక చిక్కుల్లో కూడా పడింది. ఈవెంట్లో మాట్లాడిన రష్మిక.. నా బాల్యం ఇక్కడే గడిపాను కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నాన్న ఇక్కడే పనిచేసినందున మేము చెన్నైలోనే నివసించాం. నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు ఆ పాఠశాల ఉందో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత, మేము కూర్గ్‌కు వెళ్లాము. నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం అని రష్మిక చెప్పడంతో కన్నడిగులు మండిపడుతున్నారు. ఇప్పటికే కమల్ కన్నడని తక్కువ చేసి తమిళ భాషని పై స్థానంలో నిలబెట్టాడని కన్నడిగులు ఫైర్ మీదున్నారు. ఇప్పుడు రష్మికపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనిపై అమ్మడు స్పందిస్తుందా అనేది చూడాలి.