Mangli | తెలంగాణ పాటలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న మంగ్లీ తన బర్త్ డే పార్టీతో చిక్కుల్లో పడింది. మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ తన బర్త్‌డే సందర్భంగా ఓ పార్టీ ఇచ్చింది. అయితే ఆ పార్టీలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతుందంటూ పోలీసులకి సమాచారం అందడంతో పోలీసుల బృందం రైడ్ చేశారు. ఇందులో భాగంగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ దొరికిపోయాడు. ఇక ఈ పార్టీలో తెలుగు సినిమా రంగానికి చెందిన యువ తార దివి , యువ పాటల రచయిత కాసర్ల శ్యామ్, యువ సింగర్ ధనుంజయ్, ఓ నిర్మాత కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
మంగ్లీ పార్టీకి సంబంధించిన ఫొటోలు , వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. అయితే పార్టీకి హాజరుకాని కొందరు పేర్లు కూడా చేర్చడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమెడియన్ రచ్చ రవి తన పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సింగర్ మంగ్లీ పార్టీకి హాజరుకాలేదు. కానీ నేను ఆ పార్టీలో ఉన్నట్టు కొన్ని వార్తలు నా వద్దకు వచ్చాయి. నేను సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను. కనీసం నా ఫ్యామిలీని కూడా కలుసుకోలేని పరిస్థితి. అంత బిజీ ఉన్న నేను పార్టీకి ఎలా హాజరవుతాను. ఈ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రచ్చ రవి వివరణ ఇచ్చారు. మరోవైపు దివి కూడా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రకటనలు చేయోద్దంటూ కామెంట్స్ చేసింది.
ఇక తాజాగా మంగ్లీ కూడా ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. ఓ వీడియో రిలీజ్ చేసిన మంగ్లీ.. నా బర్త్ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరిని ఆహ్వానించాను. అయితే లిక్కర్, సౌండ్ సిస్టం ఏర్పాటుకి అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా.. సడన్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునే దాన్ని. నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడ లేదు. గంజాయి పాజిటివ్‌గా పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా..? ఒక రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటాను. కానీ, ఇలాంటివి ఎందుకు చేస్తాను..? మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు, ప్లీజ్..అని మంగ్లీ రిక్వెస్ట్ చేసింది.