Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రం జూన్లో విడుదల అవుతుందని ఆశగా ఎదురు చూసారు. కాని పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా వాస్తవంగా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందున మూవీ వాయిదా పడింది.
హరిహర వీరమల్లు చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఎక్కువగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఏర్పడింది. ఇరాన్ తో పాటు ఇతర దేశాల్లో టెక్నికల్ వర్క్ జరుగుతున్నది. అయితే ఇంకా పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, హడావిడిగా చివరి నిమిషంలో విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతో మేకర్స్ మరోసారి మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ నెవర్ బిఫోర్ లెవెల్లో ఉంటుంది అని మేకర్స్ ప్రామిస్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లులో మొత్తం 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట. అలాగే ప్రతీ షాట్ లో 10 లేయర్స్ ఉంటాయని, మొత్తం వర్క్ అంతా ఒకెత్తు అయితే ఒక్క క్లైమాక్స్ పోర్షన్ విఎఫ్ఎక్స్ వేరే లేవల్లో ఉంటుందట. క్లైమాక్స్ కోసమే మేకర్స్ ఏకంగా 25 కోట్లు వెచ్చించినట్టుగా తెలుస్తుంది. సినిమా అద్భుతంగా వచ్చేందుకు మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఆడియెన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా సిద్ధం చేస్తున్నారట. జూన్ 12న రిలీజ్ కావల్సిన ఈ చిత్రం వాయిదా పడడంతో జులై 4న రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే ఆ రోజు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.