Bayyaram Pedda Cheruvu | బయ్యారం జూలై 20 : కాకతీయ రాజులతో నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ – ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మసి వాగులు ప్రవహించి పెద్ద చెరువులోకి వరద నీరు చేరుకుంటుంది. పెద్ద చెరువు గరిష్ట నీటి మట్టం 16.2 అడుగులు కాగా.. ప్రస్తుతం 11 అడుగులకు చేరుకుంది.
వర్షాలు కురిస్తే మరో ఐదు రోజుల్లో చెరువు అలుగు పారే అవకాశం ఉందని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్ద చెరువు అలుగు నీటి ద్వారానే గార్ల మండలం సీతంపేటలోని పెద్ద చెరువు నిండుతుంది. అయితే అక్కడ వ్యవసాయ పనులు నిర్వహించేందుకు చెరువు నీటిని వదిలాల్సి ఉంటుంది. అయితే అలుగు పారే అవకాశం ఉండడంతో అక్కడి రైతులు బయ్యారం పెద్ద చెరువుకు అలుగు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి ఏటా జూన్ మొదటి లేదా రెండో వారంలోనే పెద్ద చెరువు అలుగు పారుతుండగా.. ఈ ఏడాది ఆలస్యం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెద్ద చెరువులోకి నీరు చేరుతుండడంతో సందర్శకుల తాకిడి కూడా ప్రారంభమైంది.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి