Errabelli Dayakar Rao | మహబూబాబాద్ : దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొన్న మహారాష్ట్రలో, ఇవాళ ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ను ప్రజలు పట్టించుకోలేదన్నారు. అదే విధంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రతి పథకానికి మీసేవ దరఖాస్తుల పేరిట ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు విమర్శించారు. రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పన్న ఆయన.. పేదలకు న్యాయం చేసే సంకల్పం లేకుండా, ప్రభుత్వ నిధులను కోతలు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఆరోపించిన ఆయన, ప్రజా పాలన, గ్రామ సభల పేరిట హడావుడి చేసి, చివరికి మళ్లీ మీ సేవ దరఖాస్తుల పేరుతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నారన్నారు. ఇది పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లే అని ఎద్దేవా చేశారు.
బ్రోకర్‌గా వ్యవహరిస్తూ.. నెంబర్ వన్ స్థానంలో..
ప్రభుత్వం ఇప్పటికైనా తాత్కాలిక చర్యలను పక్కన పెట్టి, పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి. దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసగించకుండా, హామీలను అమలు చేసి తీరాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని ఆరోపించారు.రాజకీయాల్లో ప్రజాసేవకంటే, బ్రోకర్ పనులు చేసుకుంటూ స్వప్రయోజనాలు చూసుకోవడంలో రేవంత్ రెడ్డి ముందుంటారన్నారు. సీఎం అయిన తర్వాత కూడా అదే తంతు కొనసాగిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిందని, అయితే ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.
రైతులకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు నిరుద్యోగ భృతి, తులం బంగారం.. ఇలా పలు హామీలు ఇచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలుచేయలేకపోయారన్నారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది వారికి బుద్ధి చెప్పే సమయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని, లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు పొనుగంటి సోమేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య, పట్టణ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.ప్రదీప్ రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు, మనిరాజు, తుర్పటి రవి, శంకర్, జై సింగ్, ఎస్కే అంకూస్, కాలు నాయక్, రాయేశెట్టి వెంకన్న, జాటోత్ స్వామి, భాస్కర్, సోమలింగం, డిష్ శ్రీనివాస్, జాటోత్ సురేష్, రాజు, ఎల్పుకొండ రమేష్,తదితరులు పాల్గొన్నారు.
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా