Delhi LG | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఏకంగా 48 చోట్ల జయకేతనం ఎగురవేసింది. దీంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విమారం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ కాషాయ దళం వశమైంది. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ (Delhi LG) నుంచి ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు అందాయి.
సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్, హార్డ్ డ్రైవ్స్ బయటకు వెళ్ల కూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి ఎలాంటి ఫైల్స్, డాకుమెంట్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్ బయటకి తీసుకెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ అత్యవసరమైతే జనరల్ అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో సెక్రటేరియట్‌కు చెందిన అన్ని విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని ఎల్జీ కార్యాలయం ఆదేశాల్లో పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై బీజేపీ గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు మంత్రులు, ఆప్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన నేపథ్యంలో కీలక ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్జీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read..
PM Modi | ఢిల్లీ అభివృద్ధికి మా గ్యారంటీ.. ఫలితాలపై మోదీ ట్వీట్
Parvesh Verma | సీఎం రేసులో పర్వేశ్ వర్మ.. గెలుపు అనంతరం అమిత్ షాతో భేటీ
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా