Parvesh Verma | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 47 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ జెండా ఎగరబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తరఫున సీఎం రేసులో ఉన్న పర్వేశ్ వర్మ (Parvesh Verma).. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిశారు.
న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన పర్వేశ్ వర్మ.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీపై గెలుపొందారు. పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ముందంజలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆయన అమిత్ షాను కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
#WATCH | BJP candidate from New Delhi assembly seat Parvesh Verma celebrates his victory after he defeats AAP national convener and former Delhi CM, Arvind Kejriwal#DelhiElection2025 pic.twitter.com/Z20ZjMM81m
— ANI (@ANI) February 8, 2025
కాగా, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కీలక నేతలంతా ఓటమి చవిచూశారు. న్యూ ఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ తదితర కీలక నేతలు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. కల్కాజీ స్థానం నుంచి సీఎం అతిశీ గెలుపొందారు.
Also Read..
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా
Delhi Election Results | గెలుపు దిశగా బీజేపీ.. ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు..?
Congress | కాంగ్రెస్ కథ కంచికే.. ఢిల్లీలో ఖాతా తెరవని హస్తం పార్టీ