Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగిస్తోంది. తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 46 స్థానాల్లో జోరు ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండటంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానుండటంతో నాయకుల్లో జోష్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్రంగా చర్చ నడుస్తోంది.
సీఎం రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ముందంజలో ఉన్నారు. ఇక మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి, విజేంద్ర గుప్తా పేర్లు కూడా సీఎం రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని సీఎంగా, ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ విజయంలో వీరేంద్ర సచ్‌దేవా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. ఫలితాలను చూస్తుంటే, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావాలో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
Also Read..
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
BJP | ఢిల్లీ ఫలితాల్లో ఆప్‌కు షాక్.. 45 స్థానాల్లో దూసుకెళ్తున్న బీజేపీ
Congress | కాంగ్రెస్ కథ కంచికే.. ఢిల్లీలో ఖాతా తెరవని హస్తం పార్టీ