Misbehave | మహిళ పట్ల అటెండర్ అసభ్య ప్రవర్తన.. చెప్పుతో దేహశుద్ది.. వీడియో
Misbehave | మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా భూమి పరిహారం కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది.
Misbehave | మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ ఆ అటెండర్‌కు చెప్పుతో బుద్దిచెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా భూమి పరిహారం కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది.
సమీకృత కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పని చేసే అటెండర్ మురళి యాకమ్మతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన యాకమ్మ బంధువులు ఉద్యోగిపై చెప్పుతో దాడి చేశారు. బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరిష్, రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవేలో యాకమ్మకు చెందిన భూమి పోయింది. దానికి సంబంధించిన నష్టపరిహారం గురించి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో మురళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని యాకమ్మ సోదరుడు మీడియాకు వెల్లడించాడు.
కలెక్టర్ కార్యాలయంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్.. చెప్పుతో బుద్దిచెప్పిన మహిళ
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన యాకమ్మ అనే మహిళతో సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అసభ్యంగా ప్రవర్తించిన రెవెన్యూ విభాగంలో పని చేసే అటెండర్ మురళి
దీంతో ఆగ్రహించి ఉద్యోగి పై చెప్పుతో… pic.twitter.com/i2oEM0dzDs
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
Read Also :
Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..!
Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

