Gandra Venkataramana Reddy| చిట్యాల, ఫిబ్రవరి 08 : నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇవాళ చిట్యాల మండలంలోని జూకల్ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నమైందని.. గ్రామంలో బీఆర్ఎస్ దళం తమ గళం విప్పాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలు సమిష్టిగా కష్టపడితే రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమన్నారు. ఓట్లు పెట్టి ప్రజలకు మాట ఇచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనీ, ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారన్నారు. కాగా కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు.
అబద్ధాల పునాదులకు చరమగీతం పాడాల్సిందే..
కాంగ్రెస్ ప్రభుత్వపు అబద్ధాల పునాదులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంఫై వ్యతిరేకత మొదలైందని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నాయకులు కొత్త డ్రామాలాడుతున్నారని, పాలన చేతకాకనే డైవర్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇచ్చేది లేదు, అమలు చేసే ఉద్దేశం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా బుద్ధి చెప్పాలి అంటే స్థానిక సంస్థల్లో మన బలం బలగాన్ని పెంచుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అందుకుగాను ప్రతి కార్యకర్త సైనికుల్లా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేసీఆర్ పథకాలు ప్రజల మదిలో యాదిగా, నిండుగా మెండుగా నిలిచి ఉన్నాయని, కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పుకోవడానికి ఏ ఒక్క పథకం సంపూర్ణంగా అమలు చేసింది లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాంబాబు, మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్, ఉపాధ్యక్షుడు కాట్రేవుల కుమార్, మండల యూత్ ప్రెసిడెంట్ తౌటం నవీన్, సీనియర్ నాయకులు దావు వీరారెడ్డి, కొత్తూరు రాజిరెడ్డి, కర్రే అశోక్ రెడ్డి, పిట్ట సురేష్, నోముల నాగరాజ్, తొట్ల ఐలయ్య, పుట్టపాక మహేందర్, మహిళ నాయకురాల్లు మల్లక్క, శ్రీదేవి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా