Lok Adalat | భూపాల్ పల్లి రూరల్, ఫిబ్రవరి 22 : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నారాయణ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 08న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కంటే ముందు ఈ నెల 26 నుండి మార్చి 07వరకు ప్రీ లోక్ అదాలత్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని తెలిపారు.
రాజీ మార్గంలో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం చేసే ఉద్దేశంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజీ పడదగిన అన్ని సివిల్, క్రిమినల్, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, వైవాహిక కేసులు, ఆస్థి తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్ కేసులు పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.
క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని, విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని జడ్జి అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతారణంలో ప్రజలు జీవించాలని ఆయన సూచించారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్‌పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి