Pragathi Grama Sabhalu | ఐదు విడతలకు రైతు బంధు వేయాలి.. ఒక ఎకరాకే నిధులు.. ఎందుకీ ప్రగతి గ్రామ సభలు..?
Pragathi Grama Sabhalu | ఒక ఎకరాకే నిధులు వేస్తారా.. మిగిలినవి ఎగ్గొడతారా.. ? పింఛన్లు ఇస్తామని ఇప్పటికీ పింఛన్లను పెంచలేదని.. తులం బంగారం ఏమైందని.. ఎందుకీ ప్రగతి గ్రామసభలంటూ లింగాల గణపురం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pragathi Grama Sabhalu | లింగాల గణపురం, ఏప్రిల్ 02 : జనగామ జిల్లా లింగాల గణపురంలో జరిగిన గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. రైతుబంధు నిధులు ఒక ఎకరాకే వేశారని అది కూడా ఒక విడత మాత్రమే వేశారని…. వాస్తవానికి ప్రతీ రైతుకు ఐదు విడతలు నిధులు ప్రభుత్వం జమ చేయాల్సి ఉందన్నారు. ఒక ఎకరాకే నిధులు వేస్తారా.. మిగిలినవి ఎగ్గొడతారా.. ? పింఛన్లు ఇస్తామని ఇప్పటికీ పింఛన్లను పెంచలేదని.. తులం బంగారం ఏమైందని.. రైతు రుణమాఫీ అందరికీ కాలేదని.. మహిళలకు ఇస్తామన్న నిధులు ఎగ్గొట్టారని.. ఎందుకీ ప్రగతి గ్రామసభలంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామసభను బహిష్కరించాలంటూ సర్పంచ్ ఎడ్ల లావణ్య రాజును గ్రామస్తులు ఒత్తిడి చేశారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఆర్డీఓ గోపిరామ్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే లింగాల గణపురం చేరుకొని వాటిని చర్చిద్దాం అని సభను పక్కదోవ పట్టించారు. ఉచిత బస్సు సౌకర్యం అందుతుందంటూ మహిళలను ప్రశ్నించి, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు సక్రమంగా వస్తున్నాయంటూ వారిని ప్రశ్నించి సానుకూలంగా సమాధానాలు చెప్పించుకొని గ్రామసభను మమా అనిపించి ఆర్డీవో అక్కడి నుంచి జారుకున్నారు….
గత పల్లె ప్రగతి సమావేశంలో ఇచ్చిన ఆర్జీలకే ఇప్పటివరకు దిక్కులేదు మళ్ళీ ఈ సభలు ఏంటని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏదునూరి వీరన్న, కిమిడి వెంకటేష్, లక్ష్మీనారాయణ, బెజ్జం చంద్రయ్య, గట్ట గళ్ళ శ్రీహరి, పుల్కరం ఉప్పలయ్య, పోరెడ్డి ఎల్లారెడ్డి, శోభ తదితరులు గ్రామసభలో అధికారులను నిలదీశారు. సమాధానాలు చెప్పకుండానే మామా అనిపించి అధికారులు గ్రామ సభను అయింది అనిపించుకున్నారు.
Read Also :
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

