Aidwa | బచ్చన్నపేట, ఆగస్టు 23 : అఖిల భారత ప్రజాతంత్ర మహిళలపై దాడులు, హత్యలను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య అన్నారు. ఐద్వా బచ్చన్నపేట మండల కమిటీ సమావేశం స్థానిక ఆఫీసులో భాషెట్టి శోభ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస, దాడులు హత్యలు,అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోయాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడంలో విఫలమయ్యాయన్నారు. సమాజంలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మహిళా వివక్షత కలిగిన ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు.
భారత రాజ్యాంగం కాదు.. మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందన్నారు. కాబట్టి మహిళలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారం జరిగిన మహిళల్ని బీజేపీ మంత్రులు కించపరుస్తూ మహిళలను బాధ్యుల్ని చేస్తూ స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు. మహిళలని వివస్త్రను చేసి ఊరేగిస్తూ దోషుల పక్షాన నిలబడి వారికి సపోర్ట్ చేస్తూ ఊరోగింపులు చేస్తుందన్నారు.
రాష్ట్రంలో చిన్నారులపై హత్యలు పెరిగిపోయాయని.. స్కూలుకు పోయే పిల్లలపై యువకులు క్రైమ్ వెబ్ సిరీస్ చూసి హింసకు పాల్పడుతున్నారన్నారు. అందులో భాగమే కూకట్‌పల్లిలోని బాలిక సహస్రను హత్య చేయడం బాధాకరమన్నారు. మహిళలపై చిన్నారులపై దాడులకు హత్యలు, అత్యాచారాలకు కారణమైన వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని ఏరులై పారుతున్న యువతను నిర్వీర్యం చేసే గంజాయి మద్యాన్ని నియంత్రించాలని మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మానేపల్లి నిర్మల, రాళ్ల బండి కావ్య, కొమ్ము శిరీష, సుంచు కవిత పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి : పిట్టల అశోక్
Peddapally | యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త శ్యామల
Sanjay Dutt | సంజూ భాయ్ అతడిని అలా కొట్టాడేంటి.. వైరల్ అవుతున్న వీడియో