Kadiyam Srihari | జనగామ జిల్లా లింగాల గణపురంలో జరిగిన కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. లింగాల గణపురంలో కురుమ సంఘం మండల అధ్యక్షుడు వట్టిపల్లి సంపత్ అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్టేషన్ ఘన్పూర్, ఆలేరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, బీర్ల ఐలయ్య హాజరయ్యారు.
ఈ సమావేశంలో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కురుమలకు గౌరవం దక్కిందన్నారు. కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ స్థానం కురుమలకు దక్కిందని.. ఎమ్మెల్సీగా ఎగ్గ మల్లేశంకు కురుమ సామాజిక వర్గానికి గౌరవం దక్కిందని సేవెల్లి సంపత్ అన్నారు. సీఎం రేవంత్‌ను నమ్ముకుని ఎగ్గ మల్లేశం కాంగ్రెస్‌లో చేరితే రేవంత్ ఆయనకు ద్రోహం చేసిండని ఆరోపించారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను ఏనాడు ఎవరిని మోసం చేయలేదని.. ఆయా సామాజిక వర్గాలకు ఆయా వ్యక్తుల ప్రావీణ్యాన్ని, పనిని బట్టే అవకాశాలు వస్తాయంటూ… ఎగ్గ మల్లేశంకు జరిగిన ద్రోహం గురించి ఎలాంటి సమాధానం చెప్పకుండానే కడియం దాటవేశారు. కడియం తీరుతో కురుమ కులస్తులు, సంఘాల నాయకులు విస్మయం చెందారు. ఊహించని సంఘటన ఎదురవడంతో కడియం శ్రీహరి షాక్‌కు లోనయ్యారు.
EC Clarification: నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్‌కు సర్ నోటీసు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
NIT Warangal | వరంగల్ నిట్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
Jammu and Kashmir | కాశ్మీర్ లో పోలీసుల కీలక ఆపరేషన్.. తొలిసారి మసీదుల్లో తనిఖీలు..