న్యూఢిల్లీ : తన గుర్తింపు నిరూపించుకోవాలంటూ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్‌కు ఈసీ నుంచి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ(EC Clarification) చ్చింది. నేవీ మాజీ చీఫ్ ఎన్యుమరేషన్ ఫామ్‌లో అనేక వివరాలు లేవని చెప్పింది. గోవాలో ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్న సందర్భంగా సర్ అధికారులు మాజీ నేవీ చీఫ్ ఇంటికి వెళ్లారు. రిటైర్మెంట్ తర్వాత ప్రకాశ్ గోవాలో స్థిరపడ్డారు. అయితే సర్ కోసం ఆయన తన ఐడెంటిటీ చూపాలని ఈసీ అధికారులు కోరారు. 1971 ఇండోపాక్ వార్‌లో పనిచేశారని, వీర చక్ర అవార్డు గెలిచారని, ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆందోళనకరంగా ఉన్నట్లు కొందరు సైనిక దళాల విరమణ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం దీనిపై ఈసీ క్లారిటీ ఇచ్చింది.
కోర్టాలిం అసెంబ్లీ నియోజకవర్గంలో నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ నుంచి పార్ట్ నెంబర్ 43కి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ సమాచారాన్ని సేకరించారని, అయితే ఎన్యుమరేషన్ దరఖాస్తులో అవసరమైన వివరాలు లేవని, గతంలో సర్ చేపట్టినప్పుడు కూడా ఆ వివరాలు లేవని, వాటిల్లో ఓటరు పేరు, ఎపిక్ నెంబర్, బంధువు పేరు, అసెంబ్లీ నియోజకవర్గ పేరు, నెంబర్, పార్ట్ నెంబర్, సీనియరల్ నెంబర్ లేవని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ మెడోరా ఎర్మోమిల్లా డీకాస్టా తెలిపారు. కీలకమైన ఐడెంటిఫికేషన్ వివరాలు లేనందు వల్లే బీఎల్ఓ అప్లికేషన్ ఆటోమెటిక్‌గా అప్డేట్ కాలేదన్నారు. గతంలో సర్ చేపట్టినప్పుడు అన్ని అంశాలను ఖాళీగా వదిలి వేయడం వల్ల , కంప్యూటర్ సిస్టమ్‌లో ఆ ఎన్యుమరేషన్‌ను అన్మ్యాప్డ్ కేటగిరీగా చూపించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఐడెంటిటీ వివరాలను పొందుపరిస్తేనే బీఎల్వో అప్లికేషన్ ఆటోమెటిక్‌గా అప్డేట్ అయ్యే రీతిలో డిజైన్ చేసినట్లు చెప్పారు.