హైదరాబాద్ : జనగామ జిల్లాలో పెద్దపులి కదలికలు కలకలం సృష్టిస్తున్నా యి. కొన్ని రోజులుగా మూగ జీవాలపై వరుస దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా నర్మెట మండలం అమ్మాపురం గ్రామంలో రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను గుర్తించారు. పులి ప్రాణాలకు ఆటంకం కలిగొంచొద్దని సూచించారు. కాగా, అటవీశాఖ అధికారులు వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
T20 World Cup 2026 | గాయంతో ప్రారంభ మ్యాచ్కు పేసర్ బుమ్రా దూరం..!
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం..భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త