Parasakthi | మరో సంక్రాంతి మూవీ ఓటీటీలో సందడి.. థియేటర్ల తర్వాత డిజిటల్లో..
Parasakthi | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
Parasakthi | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కథ, స్క్రీన్‌ప్లే అంశాలపై మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్లలో నాలుగు వారాల రన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో ప్రస్తుతం ‘పరాశక్తి’ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేకర్స్ విస్తృత ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ను కూడా జోడించారు. సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటి వద్దే వీక్షించే సౌలభ్యం, మల్టీలాంగ్వేజ్ ఆప్షన్లు ఈ సినిమాకు ప్లస్ కావచ్చని అంటున్నారు. ముఖ్యంగా శివకార్తికేయన్–సుధా కొంగర కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ డిజిటల్ వ్యూస్‌ను పెంచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ నిర్మించగా, అధర్వ మురళి, రవి మోహన్ కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రాజకీయ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికపై ఎలాంటి ఆదరణ పొందుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే సంక్రాంతి మూవీ రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ జరుపుకుంటుండగా, మన శంకర వరప్రసాద్ గారు, నారి నారి నడుమ మురారా, అనగనగా ఒక రోజు వంటి చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

