Prohibition of Alcohol | బచ్చన్నపేట, ఏప్రిల్ 2 : తమ గ్రామంలో ఈ నెల 10 నుంచి మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గంగాపూర్ గ్రామ సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మద్యపాన విక్రయాల వల్ల ఎన్నో కుటుంబాలు తాగుడుకు బానిసై, చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే ప్రజలంతా ఏకతాటిపైకి ముందుకు వచ్చి, గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారని ఆయన వెల్లడించారు. గ్రామసభ తీర్మానం కాదని గ్రామంలో మద్యం విక్రయించిన వారికి పంచాయతీ ఆధ్వర్యంలో రూ. 50 వేల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే రూ.5 వేల నజరానా అందిస్తామని వెల్లడించారు.
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తామని చెప్పారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో అత్యధిక నిధులు తీసుకువచ్చి గ్రామంలో దశల వారిగా సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిలుకర కుమారస్వామి, వార్డు సభ్యులు అనసూయ, రాధిక, రవళిక, మమత, కవిత, భారతమ్మ, తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి, గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు,ప్రజలు, మహిళలు,యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత