కంఠేశ్వర్, జూలై 27: నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. నిజామాబాద్‌లో 166, కామారెడ్డిలో 88 వినతులు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావుతోపాటు ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అదనపు కలెక్టర్ భుజంగరావు మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.