Eye Camp | బచ్చన్నపేట, నవంబర్ 8 : బచ్చన్నపేట మండల కేంద్రంలోని చేనేత కుటుంబాలు అందరికీ ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ వే హైదరాబాద్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. బచ్చన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
శిబిరంలో నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. శిబిరానికి వచ్చే చేనేత కార్మికులు ఆధార్ కార్డుతోపాటు, ఢిల్లీ చేనేత గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి కుటుంబ సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సభ్యులను కోరారు.
రూ.కోట్లతో కొలువులు.. నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల ప్యాకేజీ
ఇందిరమ్మ బిల్లుల్లో తిరకాసు.. నగదు చెల్లింపులో మాట మార్చిన సర్కారు
PDSU | పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ