CM Revanth Reddy | స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 17: నెల రోజులుగా యూరియా కోసం రైతులం అవస్థలు పడుతుంటే సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సీఎం, ఎమ్మెల్యేలు మా లాగా ఒక గంట లైన్లో నిలబడితే మా బాధ తెలుస్తుందని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటి దాటినా యూరియా అందించకపోగా, రేపు యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు..
చేస్తూ.. రైతుల సమస్యలను పట్టించుకోని సీఎం వెంటనే కుర్చీ దిగాలని రైతులు డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎస్ఐ వినయ్ కుమార్ రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరమింప చేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు రైతులకు యూరియాను అందించారు.
సీఎం టైంకు తింటలేడా.. రభియా (సముద్రాల, మహిళా రైతు),
ఇంట్లో కూర్చోని సమయానికి సీఎం అన్నం తింటలేడా, అలాగే పంటలకు కూడా సమయానికి ఎరువులు ఇయ్యకపోతే పంట దిగుబడి ఎలా వస్తుంది. యూరియా కోసం ఉదయం నాలుగున్నర గంటలకు రాత్రిపూట ఉన్న చద్దన్నం, మామిడి కాయ పచ్చడి పట్టుకుని, బస్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు మీటర్లు నడిచి వచ్చినం. కల్వర్టు పై నుండి నీళ్లు పోతుంటే ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని వాగు దాటించిండ్లు. మాకు ఏడు ఎకరాలు భూమి ఉంది. వారంరోజులు తిరిగితే ఒక్క బస్తా దొరికింది. మక్కజొన్న తలసుంచుకు వచ్చింది. వరి పొట్ట దశలో ఉంది. వాటికి యూరియా ఎప్పుడు చేయాలి.
అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే పరిస్థితి ?
అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం. పత్తి గింజల కోసం లైన్లు కట్టినం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ అదేపరిస్థితి వచ్చింది. పంట సాగుకు మేం పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి తెలుస్తలేదు. మా లాగా ఒక రోజు నాగలి పడితే. రోజంతా లైన్లో నిలబడితే అప్పుడు తెలుస్తది మా బాధ, రోజు యూరియా కోసం ఇట్లనే తిరిగితే మా పిల్లలను, బాయికాడ పశువులను ఎవరు చూసుకోవాలి. ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటలకు ఇంటికి పోతానం. రైతు బంధు ఒకటి ఇయ్యలే. సన్న ఒడ్లకు కు బోనస్ ఇయ్యాలే, భార్య, భర్తలకు భూమి ఉంటే ఒక్కరికే రుణమాఫీ చేసిండు, ఏవో, ఏవో చేస్తాన్నాడు. ఏ ఒక్కటి చేయలే, మా రైతులను హరిగోస పెట్టుకుంటాండు. ఈ సారి ఓట్లు అడిగేందుకు రావాలి అప్పుడు వారి సంగతి చెబుతం.
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి నీరజ్ చోప్రా
Ramavaram : ఎస్పీ ఆదేశాలు బేఖాతరు.. బ్లాక్ స్పాట్స్ గుర్తింపులో నిర్లక్ష్యం
Nidamanoor : గౌండ్లగూడెంలో నూతన బోర్ మోటార్ ప్రారంభం