టోక్యో: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra).. జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇవాళ తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్ మార్క్ దాటేశాడు. అతను జావెలిన్‌ను 84.85 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఈ టోర్నీలో ఆటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 84.50 మీటర్లు లేదా అతని గ్రూపులో బెస్ట్ 12 మంది త్రోయర్లు ఫైనల్‌కు ప్రవేశిస్తారు. కానీ ఒలింపిక్ చాంపియన్ నీరజ్ మాత్రం తన ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్వాలిఫయింగ్ మార్క్ దాటేసి ఫైనల్లో తన బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. టోక్యో ఈవెంట్లో ఇవాళ నీరజ్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. పారిస్ ఒలింపిక్స్ సమయంలో కూడా నీరజ్ తొలి ప్రయత్నంలోనే క్వాలిఫై అయి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
🚨 One and Done for Neeraj!!! 🇮🇳
Neeraj Chopra qualifies for the World Athletics Championships Final with a throw of 84.85m on his very first attempt!
Qualification standard: 84.50m (Q) or top 12 best throws overall#WorldAthleticsChampionships #Athletics #Javelin… pic.twitter.com/5loL3yWwzk
— nnis Sports (@nnis_sports) September 17, 2025
వరల్డ్ ఛాంపియన్, జర్మనీ త్రోయర్ జులియన్ వెబర్ తన రెండో ప్రయత్నంలో క్వాలిఫయింగ్ మార్క్ దాటి ఫైనల్లోకి ప్రవేశించాడు. అతను రెండో ప్రయత్నంలో తన జావెలిన్‌ను 87.21 మీటర్ల దూరం విసిరాడు.