హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు(RTC bus )అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కాగా, హనుమకొండ నుంచి పాలకుర్తి వెళుతుండగా ప్రమాదం జరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Medak | ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Revanth Reddy | నా పాలన అద్భుతం! నా మంత్రులు బాగా పని చేస్తున్నారు