మెదక్ : ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం(Edupayala Vanadurga Bhavani temple) గురువారం భక్తులతో(Devotees) కిటకిటలాడింది. ఆలయంలో రెండో రోజు మహా శివరాత్రి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రెండో రోజు బండ్లు, బోనాలు ఊరేగించారు. తెల్లవారు జామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడుపాయల ఆలయం వద్ద అమ్మవారికి వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Woman Molest | బస్సులో యువతిపై లైంగిక దాడి.. పరారీలో నిందితుడు
HIV Positive | తీరా తాళికట్టే సమయానికి.. హెచ్ఐవీతో ఆగిన వరుడి పెండ్లి
Harish Rao | 14 నెలల్లో కుప్పకూలిన 4 ప్రాజెక్టులు.. దీనికి ఏం సమాధానం చెప్తావు?