EX MLA Dharmareddy | గీసుకొండ జూలై 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల, రైతుల కష్టాలు పట్టించుకునే తీరిక లేదని.. ఆయనకున్నది కేవలం ఢిల్లీకి సంచులు మోయటమే ఆయనకు తెలిసిన విద్య అని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి విమర్శించారు. ఆదివారం గీసుగొండ మండలంలోని ఊకల్ శివారులోని ఎస్ఎస్ గార్డెన్ లో గీసుకొండ, సంగం మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందించలేని ఈ ప్రభుత్వం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
పదేళ్లలో ఎప్పుడైనా రైతులు యూరియా కోసం లైన్లలో ఉన్నారా..? రైతులు గమనించాలని, ఆశపడి మీరు ఓటేస్తే మిమ్మల్ని నట్టేట ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెబుదామని అన్నారు. సంగం మండలంలో ఓ రైతు యూరియా బస్తాలను తీసుకుని ఇంటికి వెళుతుండగా నీకు ఎవరు బస్తాలు ఇచ్చారని పోలీసులు ఆ రైతుపై కేసు పెట్టారని.. దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, సిగ్గు ఉంటే ఎమ్మెల్యే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు మట్టి దందాలు, ఇసుక దందాలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి క్రషర్ నిర్వాహకులు కమిషన్లు ఇవ్వడం లేదని వాటిని సీజ్ చేయించి మార్కెట్లో కంకర లేకుండా చేశాడని అన్నారు. గాలిలో గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయనకు ఏం చేయాలో తెలియక నేను గతంలో శంకుస్థాపన చేసిన పనులకు శిలాఫలకాలు తొలగించి మళ్లీ శిలాఫలకాలు వేస్తూ శంకుస్థాపన చేస్తూ తిరుగుతున్నాడని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానని మీరు ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. కొత్తవారిని పార్టీలోకి తీసుకువచ్చేది లేదని మీలో ఉన్న నాయకులను గుర్తించి మీరు గ్రామస్థాయిలో సమావేశం నిర్వహించి మీరు సూచించిన వ్యక్తికే పార్టీ టికెట్లు ఇస్తానని ఆయన తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నాతో ఉండి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారిన నాయకులను మళ్లీ పార్టీలోకి తీసుకునేది లేదని వాళ్ళు వస్తే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల కాళ్లు మొక్కి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని అన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించిందని.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇచ్చిందని వాటిలో డీజిల్ పోయక గ్రామాల్లో ట్రాక్టర్లు మూలకు పడ్డాయని అన్నారు. కేసీఆర్ పేదవారికి విద్యా అందించాలని గురుకులాలు పెడితే గురుకులాల నిర్వీర్యానికి ఈ ప్రభుత్వం పూనుకుందని ఆయన పండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థుల చావుకు కారణమైన ఈ ప్రభుత్వాన్ని కఠినంగా శిక్షించాలని ఆయన హెచ్చరించారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల చేత వంటలు చేయించాలని జీవో జారీ చేసిన ఈ ముఖ్యమంత్రికి ఏం చెప్పాలని కనీసం సిగ్గు, శరం ఉందా అని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రాన్ని దోచుకుని ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, సంగం మండల అధ్యక్షుడు సారంగపాణి. జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు. మాజీ జెడ్పిటిసి సుదర్శన్ రెడ్డి. నాయకులు బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, గోలి రాజయ్య. సాగర్ రెడ్డి. గుర్రం రఘు. ప్రమోద్. సోషల్ మీడియా కన్వీనర్ రఘుపతి, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి