గీసుగొండ, ఫిబ్రవరి 06 : వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతం సదానందాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma reddy) , నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Sudarshan reddy) పరామర్శించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామానికి చెందిన సదానంతం తల్లి వెంకటలక్ష్మి మృతి చెందారు.
ఆమె భౌతకాయానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు శివ కుమార్. మాజీ జడ్పీటీసీ ధర్మారావు, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రకాష్. డీసీసీబీ డైరెక్టర్ రమేష్, కార్పొరేటరు మనోహర్,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Jurassic World Rebirth | ‘జూరాసిక్ వరల్డ్ రీబర్త్’ ట్రైలర్ రిలీజ్
Rangareddy | రంగారెడ్డిలో విషాదం.. స్కూల్ వ్యాన్ కింద నలిగి చిన్నారి మృతి..!
Fighter Jet Crashes | మధ్యప్రదేశ్లో కూలిన యుద్ధ విమానం.. పైలట్లు సురక్షితం