Jurassic World Rebirth Trailer | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్(Steven Spielberg) దర్శకత్వంలో వచ్చిన జూరాసిక్ పార్క్ చిత్రం ఎంతంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు. అప్పటివరకు యాక్షన్, లవ్ స్టోరి, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్న హాలీవుడ్‌కి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అనే కొత్త జానర్‌ని పరిచయం చేశాడు స్టీవెన్. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో 7 సినిమాలు రాగా బ్లాక్‌బస్టర్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంచైజీ నుంచి మరో చిత్రం రాబోతుంది.
జురాసిక్ వరల్డ్ రీబర్త్ అంటూ ఈ సినిమా రాబోతుండగా.. హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గారెత్ ఎడ్వర్డ్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూలై 04న తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, హిందీతో తదితరు భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మిషన్ కోసం డైనోసార్లు ఉండే ఐలాండ్‌కి స్పెషల్ ఏజెంట్‌గా వెళుతుంది స్కార్లెట్ జోహన్సన్. తాను అక్కడికి వెళ్లిన అనంతరం అక్కడ జరిగిన పరిణామలు ఏంటి.. ఎందుకు మనుషులపై డైనోసార్లు తిరగబడ్డాయి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.