Fighter Jet Crashes | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది (Fighter Jet Crashes). ఈ ఘటనలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
భారత వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 ఫైటర్ జెట్ (Mirage 2000 Fighter Jet) ఇవాళ మధ్యాహ్నం శివపురి (Shivpuri) సమీపంలో కూలిపోయింది. శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన విమానం ప్రమాదవశాత్తూ బహ్రేటా సాని గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కుప్పకూలింది. ఫైటర్ జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. గాయపడ్డ పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Indian immigrants | బహిష్కరణ ప్రక్రియ కొత్తేమీ కాదు.. నిబంధనల ప్రకారమే సంకెళ్లు : జై శంకర్
Flights Collied | ఎయిర్పోర్ట్లో రెండు విమానాలు ఢీ.. షాకింగ్ వీడియో
Hyderabad | జల్సాలకు బానిసై.. దొంగగా మారిన హోటల్మేనేజ్మెంట్ స్టూడెంట్