Indian immigrants | అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) అన్నారు. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని పేర్కొన్నారు. అమెరికా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులను స్వదేశానికి పంపడంపట్ల ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. బహిష్కరణ (deportation) ప్రక్రియ కొత్తేమీ కాదన్నారు.
అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది. అందులో భాగంగానే తాజాగా భారత్‌కు చెందిన వలసదారుల (Indian Migrants) ను కూడా వెనక్కి పంపింది. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులతో (illegal Indian immigrants) కూడిన విమానం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే, తరలింపు సందర్భంగా భారత వలసదారుల పట్ల అగ్రరాజ్యం అధికారులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతులను సంకెళ్లతో, కాళ్లను గొలుసులతో బంధించి తరలించడంపట్ల విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్లో ప్రకటన చేసింది.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈ మేరకు రాజ్యసభలో మాట్లాడారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు స్పందించారు. డిపోర్టేషన్ ప్రక్రియ కొత్తేమీ కాదని తెలిపారు. 2009 నుంచే ఆ ప్రక్రియ జరుగుతోందన్నారు. బహిష్కరణ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పారు. ‘బహిష్కరణ ప్రక్రియ కొత్తేమీ కాదు. ఇది కొన్ని ఏళ్లుగా కొనసాగుతోంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదు.
అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోంది. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా.. 2019లో 2 వేలకు పైగా ఉంది. ఇక వలసదారులను ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తున్నారు. వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడం అమెరికా విధానం. ఈ జర్నీలో అవసరమైనప్పుడు వాటిని తొలగిస్తారు. వారికి అవసరమైన ఆహారం, వైద్య సదుపాయాలను కూడా సమకూరుస్తారు’ అని జైశంకర్ తెలిపారు.
Also Read..
Indian immigrants | కాళ్లకు, చేతులకు సంకెళ్లతో భారత వలసదారులు.. వీడియో
Flights Collied | ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ.. షాకింగ్ వీడియో
Chandrayaan-4 | చంద్రయాన్-4 కీలక ప్రకటన..! 2027లో మిషన్ చేపడుతామన్న కేంద్రమంత్రి..!