Indian immigrants | అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను అగ్రరాజ్యం అమెరికా స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే, భారత వలసదారుల పట్ల అగ్రరాజ్యం అధికారులు అమానవీయంగా ప్రవర్తించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. భారతీయులందరినీ అమానవీయ పరిస్థితుల్లో తరలించారంటూ మండిపడుతున్నారు. పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో యూఎస్ అధికారులు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వీడియోలో వలసదారులు సంకెళ్లతో కనిపించారు.
కాళ్లను, చేతులను గొలుసులతో కట్టేశారు. ఓ వరుసలో వారంతా విమానంలోకి ఎక్కుతున్నట్లు వీడియోలో కనిపించింది. 24 సెకండ్ల ఈ వీడియోను అమెరికా సరిహద్దు గస్తీ విభాగం (US Border Patrol) చీఫ్ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా భారతదేశానికి తిరిగి పంపించాం. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తోన్న మా నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.
If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf
— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025
Also Read..
Indian immigrants | భారతీయుల్ని గెంటేసిన అమెరికా.. కాసేపట్లో పార్లమెంట్లో కేంద్రం ప్రకటన
Gold Seized | ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత