Indian immigrants | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారివారి దేశాలకు వెళ్లగొడుతోంది. అందులో భాగంగానే తాజాగా భారత్‌కు చెందిన వలసదారుల (Indian Migrants) ను కూడా వెనక్కి పంపింది. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 204 మంది భారతీయులతో (illegal Indian immigrants) కూడిన విమానం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, భారతీయులను వెనక్కి పంపడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. భారతీయులందరినీ అమానవీయ పరిస్థితుల్లో తరలించారంటూ మండిపడుతున్నారు. పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేయనుంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం ప్రధాని మోదీతో జై శంకర్ భేటీ అయ్యారు. మరోవైపు వసలదారుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ (PM Modi) సైతం రాజ్యసభలో మాట్లాడనున్నారు.
Also Read..
Gold Seized | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
Tamil Nadu | దారుణం.. బాలికపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం