Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే (teachers) కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై (school girl) అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణగిరి (Krishnagiri) జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చోటు చేసుకుంది.
కృష్ణగిరి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనవరి 3వ తేదీ నుంచి బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. దీంతో నెల రోజులుగా పాఠశాలకు ఎందుకు రావడం లేదంటూ
ప్రిన్సిపల్ నేరుగా బాలిక ఇంటికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ బాలిక ప్రస్తుతం గర్భం దాల్చినట్లు తేలింది.
పాఠశాల యాజమాన్యం సూచన మేరకు బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై బర్గూర్ ఆల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు బాలిక కుటుంబం చైల్డ్ సేఫ్టీ అధికారిని సంప్రదించగా.. వారు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
KTR | ఇకనైనా మొద్దు నిద్ర వీడాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హితవు
Harish Rao | సీఎం ఇలాకాలో పిల్లలకు ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు