KTR | ఇకనైనా మొద్దు నిద్ర వీడాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హితవు
KTR | కాంగ్రెస్ సర్కారు పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి.. గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR | కాంగ్రెస్ సర్కారు పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలోనే కాదు.. చివరికి.. గ్రామ సచివాలయాల్లో కూడా పాలన పడకేసిందని విమర్శించారు. గాడితప్పిన పంచాయతీల్లో పరిపాలన సాగేదెట్లా..? సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజల కష్టాలు తీరేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,789 పంచాయతీలు ఉండగా.. దాదాపు 80 శాతం సమస్యలతో సతమతమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక.. పల్లెల్లో పాలన పడకేసింది. ప్రత్యేకాధికారుల పాలనలో చాలా పంచాయతీలు నిర్వహణ లేక పారిశుద్ధ్యం, వీధి దీపాల మరమ్మతులకూ నిధుల కటకట ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిపైనే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని.. వీధి దీపాలు వెలగకపోవడంతో పల్లె సీమలను చిమ్మ చీకట్లు ఆవరించాయని అన్నారు.
దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయడానికి పైసల్లేవని.. పంచాయతీ ట్రాక్టర్‌కు డీజిల్ పోసే దిక్కులేదని కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలనా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాదైనా కళ్లుతెరవరా అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో రూపురేఖలు మారాయని.. నాడు పంచాయతీలకు ఠంచన్ గా కడుపునిండా నిధులు వచ్చాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ పల్లె ప్రజలకు పాత కష్టాలు తెచ్చిందని విమర్శించారు. నిన్నటి దాకా పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచ్ లు అప్పులపాలయ్యారని.. నేడు జేబుల నుంచి ఖర్చుచేసిన కార్యదర్శులకు తిప్పలు తప్పడం లేదని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడాలని.. గ్రామాల్లో సమస్యల పంచాయితీని తీర్చాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

