Flights Collied | సియాటెల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన సియాటెల్ – టాకోమా విమానాశ్రయంలో (Seattle-Tacoma Airport) ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బుధవారం ఉదయం 10:17 గంటల సమయంలో డెల్డా ఎయిర్‌లైన్స్ (Delta Air Lines), జపాన్ ఎయిర్‌లైన్స్ (Japan Airlines)కు చెందిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 142 మంది ప్రయాణికులతో సియాటెల్ నుంచి ప్యూర్టో వల్లర్టా వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. అదే సమయంలో జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 182 మంది ప్రయాణికులతో టోక్యో నుంచి సియాటెల్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం తోకభాగాన్ని జపాన్ ఫ్లైట్ వింగ్స్‌తో ఢీ కొట్టింది.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది రెండు విమానాల్లోని ప్రయాణికుల్ని వెంటనే కిందకు దించేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో సియాటెల్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై కొంత ప్రభావం పడింది. ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు విమానాలు ఢీ కొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Japan Airlines 787-9 collides with a Delta Air Lines 737-800 while taxiing at Seattle-Tacoma International Airport.
The FAA said in a statement: “The right wing of Japan Airlines Flight 68 struck the tail of Delta Air Lines Flight 1921 while the planes were taxiing at… pic.twitter.com/prN8YKtywW
— Breaking Aviation News & Videos (@aviationbrk) February 5, 2025
Also Read..
Gold Seized | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
Tamil Nadu | దారుణం.. బాలికపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం