Vishnu Vinyasam | టాలీవుడ్ యంగ్ హీరో, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీ విష్ణు తాజాగా ‘విష్ణు విన్యాసం’ అనే కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన టీజర్‌ను చిత్ర యూనిట్ బుధవారం ఘనంగా విడుదల చేసింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు ‘చిన్నూ’ అనే పాత్రలో కనిపిస్తుండగా, జాతకాలు మరియు వాస్తుపై విపరీతమైన నమ్మకంతో అతను చేసే పనులు, దాని చుట్టూ తిరిగే గందరగోళం టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రాన్ని ఒంగోలు నేపథ్యంతో మలిచారు, అక్కడ వినిపించే ప్రత్యేకమైన యాస మరియు మాటలు టీజర్లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించగా.. క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నయన్ సారిక కథానాయికగా నటిస్తుంది.
ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 28, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. శ్రీ విష్ణు నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ’ ఫిబ్రవరి 27న విడుదలవుతుండగా, మరుసటి రోజే ‘విష్ణు విన్యాసం’ రావడం విశేషం.