నర్సింహులపేట,మే 9 : భారత్, పాకిస్తాన్ మధ్వ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండల వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అనుమానిత వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించాలన్నారు. భారత్,పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
MacGill: కొకైన్ సరఫరా కేసులో.. ఆస్ట్రేలియా క్రికెటర్‌కు శిక్ష
Kantara 2 | జూనియర్ ఆర్టిస్ట్ మృతితో మాకు ఎలాంటి సంబంధం లేదన్న కాంతార 2 టీం
Fact Check | ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న పాకిస్థాన్.. నిజమో కాదో ఎలా ఈజీగా చెక్ చేయండిలా!