Garima Agarwal | సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమా అగర్వాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26:( నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన విభాగం జీవో ఆర్టీ నంబర్ 290 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన గరిమా అగర్వాల్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) విధులను నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె జిల్లా ఇంచార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ప్రభుత్వం ఇప్పుడు ఆమెను పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంచార్జి కలెక్టర్‌గా జిల్లాలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చురుకైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుండటంతో జిల్లా మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగంపై ఇప్పటికే మంచి పట్టున్న గరిమా అగర్వాల్ నియామకం పట్ల స్థానిక అధికారులు, ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

