Khammam RDO | ఖమ్మం : ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారని తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని నేరుగా వెలుగుమట్ల భూదాన్ భూముల ప్రాంతానికి వెళ్లనున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి ట్విస్ట్ నెలకొంది. కేటీఆర్ బాధితులను పరామర్శించనున్న నేపథ్యంలో కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావును ప్రభుత్వం అర్ధాంతరంగా బదిలీ చేసింది.
ఖమ్మం ఆర్డీవో నరసింహారావు మెట్ పల్లికి బదిలీ అయ్యారు. కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మొత్తం అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగా బదిలీ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్ పల్లిలో పనిచేస్తున్న ఆర్డీవో శ్రీనివాసరావుని ఖమ్మం ఆర్డీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనాల్లో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించనున్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అక్కడి మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం