Supplements | ఈ సప్లిమెంట్లను మీరు తరచూ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త.. హెచ్చరిస్తున్న వైద్యులు..
ఈ మధ్యకాలంలో చాలా మంది సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నారు. ఆరోగ్యాన్ని పెంచడానికి , పోషక అంతరాలను పూరించడానికి అనేక వనమూలికలను తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సహజమైనవి, సురక్షితమైనవి అని లేబుల్ చేయబడి ఉంటున్నాయి. దీంతో వీటిని ఉపయోగించే వారు ఇవన్నీ కూడా సురక్షితమైనవి అని భావిస్తున్నారు.
Supplements | ఈ మధ్యకాలంలో చాలా మంది సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నారు. ఆరోగ్యాన్ని పెంచడానికి , పోషక అంతరాలను పూరించడానికి అనేక వనమూలికలను తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సహజమైనవి, సురక్షితమైనవి అని లేబుల్ చేయబడి ఉంటున్నాయి. దీంతో వీటిని ఉపయోగించే వారు ఇవన్నీ కూడా సురక్షితమైనవి అని భావిస్తున్నారు. కానీ లేబుల్ చేయబడిన మాత్రాన ఇవన్నీ సురక్షితం కావనీ వైద్యులు చెబుతున్నారు. వీటిని వాడడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ మందులు ముఖ్యమైన అవయవాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. సప్లిమెంట్స్, మూలికా మందులు అందరికీ సురక్షితం కావని ఇవి ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఎక్కువగా ఉపయోగించే కొన్ని రకాల సప్లిమెంట్స్, మూలికలు శరీరంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ క్యాప్సూల్స్..
గ్రీన్ టీ ని చాలా మంది తాగుతూ ఉంటారు. ఒక కప్పు గ్రీన్ టీ తాగడం సురక్షితమైనదే. అయితే గ్రీన్ టీ ని సులభంగా తయారు చేసి తీసుకోవడానికి చాలా మంది క్యాప్సుల్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ క్యాప్సుల్స్ లో అధిక స్థాయిల్లో కాటెకిన్లు ఉంటాయి. ముఖ్యంగా అధిక మొత్తంలో ఉండే EGCG కాలేయ మంటను, తీవ్రమైన కాలేయ అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక గ్రీన్ టీ క్యాప్సుల్స్ ను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ప్రోటీన్ పౌడర్లు..
అలాగే రోజూ వ్యాయామం చేసేవారు ప్రోటీన్ పౌడర్లను ఎక్కువగా తీసుకుంటారు. కానీ వీటిని వైద్యుడిని సంప్రదించకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నైట్రోజన్ వ్యర్థాలు ఎక్కువగా తయారవుతాయి. ఈ వ్యర్థాలను బయటకు పంపించడానికి మూత్రపిండాలు అదనంగా పని చేయాల్సి వస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా పడడం వల్ల వాటి పనితీరు మందగించడంతో పాటు మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ పౌడర్ అవసరమైనప్పటికి దీనిని అతిగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ సప్లిమెంట్లు..
కొవ్వులో కరిగే విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి వాటిని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది తీసుకుంటున్నారు. ఈ విటమిన్లు కొవ్వు కణజాలాల్లో పేరుకుపోతాయి. వీటిని ఎక్కువగా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు కణజాలల్లో అధికంగా నిల్వ చేయబడతాయి. ముఖ్యంగా విటమిన్ ఎ ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారు వైద్యుడిని సంప్రదించకుండా ఈ విటమిన్లను తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఐరన్ సప్లిమెంట్స్ వాడకం కూడా పెరిగిందని చెప్పవచ్చు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కణజాలాల్లో ఐరన్ పేరుకుపోయి హిమోక్రోమాటోసిస్ అనే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. దీని వల్ల అవయవాల పనితీరు తగ్గుతుంది. దీర్థకాలిక నష్టం కలుగుతుంది. అలాగే కాంఫ్రే( సొరక చెట్టు) వంటి హెర్బల్ మూలికలను ఉపయోగించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో కాలేయానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే సమ్మేళనాలు ఉంటాయి. ఈ మూలికలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
అతిమధురం వేర్లు..
లికోరైస్ రూట్ ను కూడా కొన్ని రకాల నివారణలల్లో ఉపయోగిస్తారు. దీనిని అధికంగా వాడడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. రక్తపోటు తగ్గుతుంది. మూత్రపిండాలు, గుండె జబ్బులతో బాధపడే, అంతర్లీన ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది. అదే విధంగా డిటాక్స్, కొవ్వును కరిగించే సప్లిమెంట్స్ త్వరిత ఫలితాలను ఇస్తాయి. అయితే ఇవి కాలేయ జీవక్రియ ప్రక్రియను, మూత్రపిండాల వడపోత ప్రక్రియను మందగించేలా చేస్తాయి. వీటిని అధికంగా వాడడం వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. సప్లిమెంట్స్ ను, మూలికలను తీసుకోవడం మంచిదే అయినప్పటికీ వీటిని తగిన మోతాదులో వైద్యుడి సూచనల మేరకు ఉపయోగించడం మంచిది. సప్లిమెంట్స్ ను అధికంగా ఉపయోగించడం వల్ల కాలేయం, మూత్రపిండాలతో పాటు శరీర ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక వీటిని తగిన మోతాదులో వైద్యుడిని సంప్రదించిన తరువాత ఉపయోగించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- supplements
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

