న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువార్ట్ మెక్ గిల్(MacGill).. జైలు శిక్షలో భాగంగా సమాజ సేవలో పాల్గోననున్నాడు. కొకైన్ సరఫరా చేసిన కేసులో అతన్ని దోషిగా తేల్చారు. కొకైన్ వాడినట్లు అతను అంగీకరించాడు. డ్రగ్ డీలర్లకు తన భాగస్వామి సోదరుడిని పరిచయం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. జైలుశిక్షలో భాగంగా అతను 495 గంటల పాటు సమాజసేవలో పాల్గొనేందుకు అంగీకరించాడు. కొకైన్ డీల్ నేపథ్యంలో మెక్గిల్ను కొందరు కిడ్నాప్ చేశారు. ఆ కేసులో కొందర్ని అరెస్టు చేశారు. మార్చి నెలలో జ్యూరీ ఈ కేసులో తీర్పునిస్తూ మెక్గిల్కు క్లియరెన్స్ ఇచ్చింది.