Rinku Singh : టీ20 ప్రపంచకప్ మధ్యలోనే చేదు వార్తను విన్న భారత క్రికెటర్ రింకూ సింగ్(Rinku Singh) తన తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికాడు. క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన తండ్రి ఖంచంద్ సింగ్(Kamchand Singh) అంత్యక్రియల్లో రింకూ పాల్గొన్నాడు. తనను క్రికెటర్‌గా చూసేందుకు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చిన నాన్నను ఇంకొన్నాళ్లు బతికించుకోలేక పోయాననే బాధతో అతడు కుమిలిపోయాడు. పాడె మోస్తూ తండ్రి తమకోసం పడిన బాధల్ని.. గుర్తు చేసుకున్న భారత స్టార్ మౌనంగా రోదించాడు.
పొట్టి ప్రపంచకప్ సమయంలో భారత ఆటగాడు రింకూ సింగ్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయం క్యాన్సర్‌తో బాధ పడుతున్న అతడి తండ్రి ఖంచంద్ సింగ్ మరణించాడు. సూపర్ 8లో జింబాబ్వేతో కీలకమైన మ్యాచ్‌కు ముందే ఆయన ఆరోగ్యం విషమించింది. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రిలో ఆయనను చేర్పించారనే విషయం తెలిసిన రింకూ.. అత్యవసరంగా జట్టును వీడాడు. ఆరోగ్యం కాస్త మెరుగ్గా అనిపించిండంతో అతడు గురువారం మళ్లీ స్క్వాడ్‌తో కలిశాడు.
అయితే.. జింబాబ్వేపై 72 వికెట్ల విజయంతో సెమీస్ ఆశలు నిలిచిన సంతోషంలో ఉండగానే తండ్రి మరణ వార్త రింకూ చెవిన పడింది. దాంతో.. చెపాక్ నుంచి హుటాహుటిన అలీగఢ్ వెళ్లిన రింకూ.. శుక్రవారం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రింకూ సింగ్ తండ్రి మృతిపట్ల భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్రికెటర్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్లు సంతాపం తెలిపారు. ఈ పరిస్థితుల్లో సెమీస్ లక్ష్యంగా భారత జట్టు మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ఈ చిచ్చరపిడుగు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
#WATCH | Aligarh, UP: Cricketer Rinku Singh gives a shoulder to the mortal remains of his father, Khanchand Singh in his funeral procession.
Khanchand Singh passed away at Yatharth Hospital in Greater Noida earlier this morning after battling fourth-stage cancer. pic.twitter.com/dsHBgG6UIj
— ANI (@ANI) February 27, 2026