Hot Spot 2 Much | 2024లో బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్‌తో సంచలనం సృష్టించిన చిత్రం ‘హాట్ స్పాట్’. ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో విడుదలై, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో, ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది దీని సీక్వెల్ ‘హాట్ స్పాట్ 2 మచ్’. విలక్షణ దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమకాలీన సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, ఆలోచింపజేసే కథాంశాలతో ఈ సీక్వెల్‌ను రూపొందించారు. కేవలం వినోదం మాత్రమే కాకుండా, సమాజంలోని కొన్ని సున్నితమైన అంశాలను ఎత్తిచూపుతూ ఈ సినిమా ఉండబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.., ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం. నిర్మించారు. ఈ చిత్రం నేడు నేరుగా ‘ఆహా’ వేదికగా విడుదలయ్యింది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో, ఈ సీక్వెల్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బోల్డ్ అండ్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘హాట్ స్పాట్ 2 మచ్’ ఒక మంచి ఆప్షన్ కానుంది.