మేడిగడ్డ కూలుతుందనేది అబద్ధం
నీళ్లు నింపితే మేడిగడ్డ కూలుతుందనేది పూర్తిగా అబద్ధమని ఇంజినీర్స్ జేఏసీ ఫౌండర్ చైర్మన్, విశ్రాంత ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 2014కు ముందునాటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లను మూసి వేయాలని, కన్నెపల్లి పంపహౌస్ మోటర్ల నుంచి నీళ్లను ఎత్తిపోయాలని, తద్వారా కరువు బారినుంచి రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడాలని హితవు పలికారు.
- అన్నారం, సుందిళ్ల గేట్లు మూయాలి
- కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలి
- కరువు నుంచి రాష్ర్టాన్ని కాపాడాలి
- రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ 2014కు ముందు నాటి దుర్భర పరిస్థితులు
- ఇంజినీర్స్ జేఏసీ ఫౌండర్ చైర్మన్ తన్నీరు వెంకటేశం
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నీళ్లు నింపితే మేడిగడ్డ కూలుతుందనేది పూర్తిగా అబద్ధమని ఇంజినీర్స్ జేఏసీ ఫౌండర్ చైర్మన్, విశ్రాంత ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 2014కు ముందునాటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లను మూసి వేయాలని, కన్నెపల్లి పంపహౌస్ మోటర్ల నుంచి నీళ్లను ఎత్తిపోయాలని, తద్వారా కరువు బారినుంచి రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడాలని హితవు పలికారు. రాష్ట్రంలోని ఎల్ నినో కరువు పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు, తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం తదితర అంశాలపై శనివారం హైదరాబాద్‌లో ఓ సంస్థ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నీటిని నిల్వ చేస్తే మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూలిపోతాయనే ప్రచారం పచ్చి అబద్ధమని తేల్చిచెప్పారు. బరాజ్‌లలో సాంకేతిక లోపం తలెత్తిన అనంతరం కూడా లక్షలాది క్యూసెక్కుల వరద ప్రవాహం మేడిగడ్డ మీదుగా వెళ్లిందని, అయినా ఎలాంటి డ్యామేజీ జరుగలేదని గుర్తుచేశారు. మేడిగడ్డ బరాజ్‌లో నీటిని నిల్వ చేయకు న్నా.. వరద ప్రవాహ సమయంలోనే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని, కరువు పరిస్థితుల నుంచి రైతాంగాన్ని కాపాడాలని అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సాకుతో నీటిని ఎత్తిపోయడం లేదని చెప్పారు.
సాగు, తాగునీటికి అల్లాడుతున్న ప్రజలు
ప్రస్తుతం రాష్ట్రంలో 2014కంటే ముందు నాటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తన్నీరు వెంకటేశం ఆందోళన వ్యక్తంచేశారు. సాగు, తాగునీటికి రాష్ట్ర ప్రజానీకం అల్లాడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువులో రాష్ట్ర ప్రజలను గట్టెక్కించడానికే కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారని వివరించారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన మూడేండ్లకు చర్చలకు వెళ్లిందని వివరించారు. కానీ గతంలోనే మహారాష్ట్రతో చర్చలు జరిగాయని, అధ్యయనం కోసం కమిటీలను ఏర్పాటు చేశారని, కానీ మహారాష్ట్ర అంగీకరించలేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మళ్లీ చర్చలంటూ మహారాష్ట్రకు వెళ్లిందని తెలిపారు. కేవలం కరువు నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే తప్ప మరేమీ కాదని భావించాల్సి వస్తున్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

