కొనసాగుతున్న రైస్ మిల్లర్ల అరెస్టు
ములుగు జిల్లాలో రైస్ మిల్లర్ల అరెస్టుల పరంపర కొసాగుతున్నది. అక్టోబర్ 25న ఏడుగురు రైస్ మిల్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపించగా, 30న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని సైతం సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ములుగు, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో రైస్ మిల్లర్ల అరెస్టుల పరంపర కొసాగుతున్నది. అక్టోబర్ 25న ఏడుగురు రైస్ మిల్లర్లను అరెస్టు చేసి జైలుకు పంపించగా, 30న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని సైతం సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా శనివారం ముగ్గురు మిల్లర్లను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. సీఎంఆర్ సరఫరాలో జరిగిన అవినీతిపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున ఆదిత్య ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చెందిన ఈదునూరి వెంకటపాపిరెడ్డి, కాట్రగడ్డ సుధీర్, రేపాక సత్యంను అదుపులోకి తీసుకొని హనుమకొండలోని సీఐడీ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం. సన్నబియ్యానికి బదులుగా దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసిన కుంభకోణంలో ములుగు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. కాగా పలువురు పరారీలో ఉండి, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

