భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు
తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాల్లో పంటలు తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలవాలగా, మరికొన్ని చోట్ల మార్కెట్లలో ఆరబోసిన పంట తడిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ, నకిరేకల్, బీబీనగర్, రామన్నపేట, పోచంపల్లి, చిట్యాల, దామరచర్ల, మిర్యాలగూడ, శాలిగౌరారం, నార్కట్‌పల్లి, కట్టంగూర్, చౌటుప్పల్, పెద్దవూర, నిడ్మనూర్, త్రిపురారం, భువనగిరి, మోత్కూరు మండలాల్లో వర్షం కురిసింది. కాగా చౌటుప్పల్, చిట్యాల, వలిగొండ మార్కెట్లతోపాటు ఐకేపీ కేంద్రాల్లోనూ ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది.
- నేలవాలిన పంటపొలాలు, మార్కెట్లలో తడిసిన ధాన్యం
- ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాల్లో రైతుల అవస్థ
- ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత అన్నదాతల వినతి
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/నాగిరెడ్డిపేట: తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాల్లో పంటలు తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలవాలగా, మరికొన్ని చోట్ల మార్కెట్లలో ఆరబోసిన పంట తడిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ, నకిరేకల్, బీబీనగర్, రామన్నపేట, పోచంపల్లి, చిట్యాల, దామరచర్ల, మిర్యాలగూడ, శాలిగౌరారం, నార్కట్‌పల్లి, కట్టంగూర్, చౌటుప్పల్, పెద్దవూర, నిడ్మనూర్, త్రిపురారం, భువనగిరి, మోత్కూరు మండలాల్లో వర్షం కురిసింది. కాగా చౌటుప్పల్, చిట్యాల, వలిగొండ మార్కెట్లతోపాటు ఐకేపీ కేంద్రాల్లోనూ ధాన్యం పెద్ద ఎత్తున తడిసింది.
మార్కెట్ యార్డుల్లో వర్షం నీటికి ధాన్యం కొట్టుకుపోయినట్టు రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చి ట్యాలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంతోపాటు వాడీ, చీనూర్, గోలిలింగాల్, బంజరతదితర గ్రామాల్లో శనివారం వర్షం కురిసిం ది. దీంతో పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పలు తడవకుండా రైతులు నానా అవస్థలు పడ్డారు. కొందరు రైతులు టార్ఫాలిన్లు కప్పారు. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

