భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
భూముల రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, రైతుల భూముల హద్దులను కచ్చితంగా గుర్తించాలని సూర్యాపేట అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అధికారులకు సూచించారు. జాజిరెడ్డిగూడెం మండలం కేశారం గ్రామంలో రీ-సర్వే పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అర్వపల్లి, నవంబర్ 19 : భూముల రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, రైతుల భూముల హద్దులను కచ్చితంగా గుర్తించాలని సూర్యాపేట అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అధికారులకు సూచించారు. జాజిరెడ్డిగూడెం మండలం కేశారం గ్రామంలో రీ-సర్వే పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే బృందంతో పాటు రైతులతో మాట్లాడి ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా భూముల సరిహద్దులను క్షుణ్ణంగా పరిశీలించాలని, పట్టాదారులు, సరిహద్దు రైతుల సమక్షంలో కొలతలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్లో భూ వివాదాలకు తావులేకుండా సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. రైతులు కూడా తమ భూముల హద్దుల గుర్తింపులో సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాసరావు, తాసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ ప్రకాష్, జీపీఓ, లైసెన్స్డ్ సర్వేయర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ఎంపీ చామల కనిపించడం లేదంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Minister Seethakka | మహిళతో కాళ్లు మొక్కించుకున్న మంత్రి సీతక్క.. వీడియో
సంబంధం ఉన్న పోలీస్ అధికారిని.. ముగ్గురితో కలిసి హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

